బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ధాకడ్. గూఢచారి తరహా యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు రజనీష్ ఘాయ్ ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. అసెలం ఫిలిమ్స్, సోహం రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, సోహెల్ మక్లాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా, సస్వత ఛటర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కంగనా ఈ సినిమాలో చేయబోతున్న భారీ యాక్షన్ సీన్స్ తో ఈ మూవీ పై నార్త్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే... తాజాగా ఈ మూవీ టీజర్ ను నిర్మాతలు రిలీజ్ చేసారు. టీజర్ ఆద్యంతం కంగనా చేసిన పోరాట సన్నివేశాలే కనిపిస్తాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బాలీవుడ్ హీరోలకు ధీటుగా కంగనా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చేసిందని చెప్పొచ్చు. కంగనా లుక్ హాలీవుడ్ మూవీ బ్లాక్ విడో ను తలపిస్తోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజులో మే 20 న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa