సర్కార్ వారి పాట చిత్రం అభిమానుల ముందుకు వచ్చేందుకు సన్నద్దమవుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ నటించిన 'సర్కారు వారి పాట' చిత్రం ఓ పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే బ్యాలన్స్ ఉన్న ఆ పాటను కూడా చిత్రీకరిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. మే 12న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తమన్ సంగీతం అందించిన 'సర్కారు వారి పాట' చిత్రంలోని 'కళావతి', 'పెన్నీ' గీతాలు శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa