ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రావు రమేష్ పై 'KGF 2' డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 01:45 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో శాండల్‌వుడ్ రాకింగ్ స్టార్ యాష్ ప్రధాన పాత్రలో నటించిన 'KGF-2' సినిమా ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం మూవీ టీమ్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల KGF-2 ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో రావు రమేష్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. రావు రమేష్‌కి ఈ సినిమాలో చిన్న పాత్ర మాత్రమే ఉందని, అయితే అతని ప్రతిభను చూసి అతని పాత్ర చాలా పొడిగించబడిందని నీల్ చెప్పారు. రావు రమేష్ కాల్షీట్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉండగా దానిని 14 రోజులు పొడిగించినట్లు నీల్ చెప్పారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ భారీ ఎత్తున నిర్మించింది. రవి బస్రూర్ ఈ పాన్ ఇండియా సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa