నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం బీస్ట్. పూజా హెగ్డే కధానాయిక. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా బుధవారం రిలీజైంది. మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ పట్ల విజయ్ అభిమానులు కూడా నిరాశ చెందారు. మంగళవారం రాత్రి నుండే తమిళనాడులోని థియేటర్ల వద్ద విజయ్ సందడి మొదలవగా, సినిమా నిరుత్సాహపరచటంతో కొంతమంది విజయ్ అభిమానులు మధురైలోని ఓ ధియేటర్ స్క్రీన్ కు నిప్పంటించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన మిగిలిన ప్రేక్షకులు సినిమా నచ్చనంత మాత్రాన స్క్రీన్ కు నిప్పంటిస్తారా? ఇదెక్కడి ఘోరం! పాపం ఆ థియేటర్ యాజమాన్యానికి ఎంత నష్టం ! అంటూ ఆ పని చేసిన విజయ్ అభిమానులపై మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa