ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్ హీరోయిన్ ఇంట్లో చోరీ.. ఇద్దరు అరెస్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 08:39 PM

బాలీవుడ్​ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్​ చేశారు. సోనమ్ ఇంట్లో పని చేసే నర్సుతో పాటు ఆమె భర్తను అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు. సోనమ్ అత్తకు వైద్య సేవల కోసం అపర్ణ రూత్ విల్సన్ అనే నర్సును కేర్ టేకర్​గా నియమించారు. ఈ చోరీ చేసింది ఆమేనని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో భాగంగా మంగళవారం రాత్రి అపర్ణ ఇంట్లో సోదాలు నిర్వహించారు.




అయితే ఇంకా చోరీకి గురైన సొత్తు మాత్రం రివకరీ కాలేదని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో అపర్ణతో పాటు ఆమె భర్త నరేశ్​ అరెస్ట్​ చేశారు. ఫిబ్రవరి 11న సోనమ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనపై అదే నెల 23న తుగ్లక్ రోడ్ పోలీసులకు సోనమ్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోనమ్ ఇంట్లో పనిచేస్తున్న వారందరినీ విచారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa