ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాల శివతో చేయనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి ఆలియా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రణ్బీర్ కపూర్ తో ఆమె వివాహం జరగనుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.జూన్ మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ను ప్రారంభించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. అయితే తమ పెళ్లి తర్వాత ఆలియా-రణ్బీర్ కొంత కాలం షూటింగ్ లకు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారట. ఈ కారణంతోనే ఆమె ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa