ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మాతగా మారిన స్టార్ దర్శకుడు

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 11:33 AM

'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఇప్పుడు నిర్మాతగా మారి తను నిర్మిస్తున్న తొలి సినిమాని ప్రకటించాడు. నిర్మాతగా తన మొదటి సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమాకి ‘లంబసింగి’ అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. 'ఎ ప్యూర్ లవ్ స్టోరీ' అనే ట్యాగ్‌లైన్‌తో రానున్న ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ దివి వడ్త్యా కథానాయికగా నటిస్తుంది. వైజాగ్‌లోని అందమైన గ్రామాలలో ‘లంబసింగి’ ఒకటి. నవీన్ గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, దృవన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa