ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం ఆలయాన్ని సందర్శించిన దర్శకుడు మెహర్ రమేష్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 11:35 AM

మెహర్ రమేష్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హైబడ్జెట్ మూవీలో చిరంజీవి శంకర్ అనే క్యారెక్టర్‌ని పోషిస్తున్నారు అని లేటెస్ట్ టాక్. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. రావు రమేష్, మురళీ శర్మ, తులసి, వెన్నెల కిషోర్, కీర్తి సురేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈరోజు దర్శకుడు రమేష్ అతని స్నేహితుడు డడ్లీతో సింహాచలం ప్రసిద్ధ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ రానున్న రోజుల్లో ప్రటకించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa