నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటిస్తున్న చిత్రం దసరా. అంతకుముందు నేను లోకల్ మూవీ లో వీరిద్దరూ కలిసి నటించగా ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే నేను లోకల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కితే, దసరా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ బొగ్గుగనుల నేపథ్యంలో గోదావరిఖనిలో జరిగే కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ లో ఒక పాట కోసం టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను రంగంలోకి దింపింది చిత్రబృందం. నాని, కీర్తిసురేష్ లపై చిత్రీకరించనున్న ఈ పాట కోసం దాదాపు 500 మంది డ్యాన్సర్లు వర్క్ చేస్తున్నారు. ఎండలు మండిపోతున్న వేళ బొగ్గుగనుల్లో ఈ పాటను చిత్రీకరిస్తూ చిత్రబృందం చాలా కష్టపడుతుంది. పోతే... తాజాగా ఈ మూవీ మేకర్స్ 500మందికి బస కల్పించటానికి గోదావరిఖని లో ఉన్న హోటళ్లు, ప్రభుత్వ వసతి గృహాలు, ఆఖరికి ఫంక్షన్ హాళ్లను కూడా బుక్ చేసేసుకున్నారట. మరి గోదావరిఖని అనే చిన్న గ్రామంలో 500మందికి బస కల్పించాలంటే ఆ మాత్రం తిప్పలు తప్పవు. అయితే దీనిపై ఆ ఊరివారు చాలా కోపంగా ఉన్నారని టాక్. వేసవికాలమంటేనే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టింది పేరు. తమ ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు ఫంక్షన్ హాళ్లు దొరకట్లేదని, ఊరు మొత్తాన్ని దసరా చిత్రబృందం కబ్జా చేసిందని గోదావరిఖని వాసుల గోల. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa