ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ తేజ్, అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రలుగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను రాబట్టి అదే జోరుతో థియేటర్లలో రన్ అవుతుంది. ఇప్పటివరకు దాదాపు 1000కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ లాంగ్ రన్ లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
అయితే ... తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' గురించి ఆసక్తికర ప్రకటన చేసారు. అదేంటంటే... దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిన ఈ సినిమా త్వరలోనే 30కి పైగా దేశాల్లో ప్రదర్శింపబడుతోందట. ఈ అక్టోబర్ లో జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ షోలు పడబోతున్నాయట. ఈ మేరకు ప్రమోషన్స్ కోసం రాజమౌళి, తారక్, చరణ్ లు రెండు రోజులు జపాన్ పర్యటనకు వెళ్ళబోతున్నారట. ఏమైనా తెలుగు సినిమా ఖండాలు దాటి పయనిస్తుంది. అందుకు కారణం జక్కన్న అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa