రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాల షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే టైగర్ నాగేశ్వరరావు సినిమాని పట్టాలెక్కించేసాడు రవితేజ. వంశీ డైరెక్షన్లో రవితేజ నటించనున్న ఈ చిత్రం టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా రూపొందనుంది. 1970లలో దేశవ్యాప్తంగా పేరుమోసిన స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాతో కెరీర్లోనే తొలిసారిగా బాలీవుడ్ ను పలకరించబోతున్నాడు రవితేజ. ఇంకా పాన్ ఇండియా వ్యాప్తంగా కూడా పరిచయమవబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు ఆడిపాడనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా నుండి తాజా అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఈ మూవీ రాత్రిళ్ళు షూటింగ్ జరుపుకుంటున్నట్టుగా తెలిపే ఒక ఫోటోను నిర్మాత అభిషేక్ ట్విట్టర్లో పోస్ట్ చేసారు. దొంగతనాల నేపథ్యంట్లో సినిమా తెరకెక్కుతుంది కాబట్టి రాత్రిళ్లే షూటింగ్ జరుపుకోవాల్సిన పరిస్థితి. దీంతో చిత్రబృందానికి రాత్రి పూట నిద్ర ఉండట్లేదట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa