దర్శకుడిగా తన తొలి చిత్రం 'సుక్ర' తో అందరినీ ఆకట్టుకున్న సుకు పూర్వజ్ తాజాగా 'మాటరాని మౌనమిది' అనే టైటిల్ తో తన రెండో సినిమాని ప్రకటించాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమా గ్లింప్సె వీడియోని విడుదల చేసారు. ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారి అందరి హృదయాలను దోచుకుంది. వీడియో గ్లింప్సె ని విడుదల చేస్తూ మేకర్స్ 'మీరు ఇంతకు ముందెన్నడూ చూడని మిస్టరీ లవ్ టేల్' అని పోస్ట్ చేసారు. ఈ చిత్రంలో మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ రామ్ చరణ్ ఈ సినిమాకి సంగీత అందిస్తున్నారు. సంజీవ్, అర్చన అనంత్, కేశవ్, సుమన్ శెట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రుద్ర పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa