ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ పూర్తి చేసుకున్న శింబు తదుపరి సినిమా

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 15, 2022, 09:55 PM

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అధికారకనగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'వెందు తనింధతు కాదు' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ యాక్షన్ పోస్టర్‌ను విడుదల చేశారు. శింబు సరసన ఈ సినిమాలో సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తోంది. సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్, సిద్దిక్, నీరజ్ మాధవ్, ఏంజెలీనా అబ్రహం తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. VELS ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్‌పై డా.ఇషారి కె గణేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa