కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవల యాక్షన్ థ్రిల్లర్ 'వాలిమై' తో బాక్స్ఆఫీస్ వద్ద పెద్ద హిట్ సాధించాడు. తాజాగా అజిత్ దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకి టెంపరరీగా 'AK61' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా సింపుల్ గా లాంచ్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం బ్యాంకు దోపిడీకి సంబంధించినదని, అజిత్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. చెన్నైలోని ప్రసిద్ధ మౌంట్ రోడ్‌ను ఆర్‌ఎఫ్‌సిలో రీ-క్రియేట్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సెట్ కోసం బోనీ కపూర్ భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa