ప్రస్తుతం దేశవ్యాప్తంగా థియేటర్లలో కేజీఎఫ్ చాప్టర్-2 హవా నడుస్తోంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యష్ హీరోగా నటించాడు. హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి, ముఖ్యపాత్రల్లో రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్ నటించారు. అన్ని భాషల్లోనూ హిట్ టాక్‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ ప్రసారంపై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. మే 13న ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా ఓటీటీ ప్రసార హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. హిందీ ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలో ప్రసారం అవనుందనే ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.