బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో తమిళ సంచలన దర్శకుడు అట్లీ ఓ సినిమా తీయనున్నారు. ప్రస్తుతం సిద్దాంత్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ సినిమా చేస్తున్నాడు షారుక్. అది పూర్తైన వెంటనే షారుక్‌తో సినిమా మరింత జోరు అందుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అందులో హీరోయిన్‌గా సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన నయనతార నటించనున్నట్లు తెలుస్తోంది. లయన్ వర్కింగ్‌టైటిల్‌తో తెరకెక్కుతున్న ముంబైలో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఏప్రిల్ 18న ముగియనుంది. ఆలోపు నయన తార ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయనుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో కూడా ఓ సినిమా చేయనున్నాడు షారుక్‌ఖాన్. రాజ్ కుమార్ హిరానీ, అట్లీ చిత్రాలలో సమన్వయంతో ఏక కాలంలో నటించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa