ఆంజనేయ స్వామికి మెగాస్టార్ చిరంజీవి వీరభక్తుడన్న విషయం అందరికి తెలిసిందే. ఆంజనేయుడిపై ఉన్న అపార భక్తిభావం తోనే కొణిదెల శివ శంకర వర ప్రసాద్ గా ఉన్న తన సొంత పేరును వెండి తెరపై చిరంజీవిగా మార్చుకుని ఆ పేరును సార్ధకం చేసుకున్నారు.
తాజాగా, నేడు హనుమాన్ జయంతి సందర్భంగా చిరు తన ట్విట్టర్లో ఒక స్పెషల్ వీడియో ను పోస్ట్ చేసి, అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలను తెలియజేసారు. ఆ స్పెషల్ వీడియో లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య షూటింగులో భాగంగా మేకప్ వేసుకుంటున్న తరుణంలో ఆయన వెనుకగా ఒక కోతి వచ్చి కూర్చుంటుంది. కొంచెం సేపయిన తర్వాత ఆ కోతికి చెర్రీ బిస్కెట్లను పెడుతూ కనిపిస్తాడు. కోతిని చెర్రీ ఫీడ్ చేస్తున్న ఈ క్యూట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తెలుగువారు కోతిని ఆంజనేయస్వామి కి ప్రతిరూపంగా భావిస్తారని తెలుసుకదా.
పోతే... చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీగా ఉంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నాయికలుగా నటించారు. కాగా... ప్రమోషన్స్ కోసం చిరు తొలిసారి తన ట్విట్టర్ ఖాతా పేరును ఆచార్య గా మార్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa