ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం OTTలో అందుబాటులోకి రానున్న సినిమాలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 06:11 PM

ఆడవాళ్లు మీకు జోహార్లు: కిషోర్ తిరుమల డైరెక్షన్ లో టాలెంటెడ్ హీరో శర్వానంద్ అండ్ కన్నడ బ్యూటీ రష్మిక నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాగ అవేరేజ్ టాక్ తో నిలిచింది. ఫ్యామిలీ డ్రామాగా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న నుండి సోనీ LIVలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


గాలివాన: సస్పెన్స్ థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ వెబ్ సిరీస్ ని 'తిమ్మరుసు' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, సాయి కుమార్, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, నందిని రాయ్ తదితరులు ఈ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14 నుండి ZEE5లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఒరిజినల్ సిరీస్‌ BBC అండ్ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. ఈ సిరీస్ కి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించారు.


జేమ్స్: కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం "జేమ్స్" మార్చి 17, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రముఖ తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ మేక విలన్‌గా నటిస్తున్నారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో సరసన ప్రియా ఆనంద్ కనిపించనుంది. ఈ సూపర్ హిట్ సినిమా సోనీ  LIVలో ప్రీమియర్ అవుతుంది.


బ్లడీ మేరీ: క్రైమ్ థ్రిల్లర్‌ట్రాక్ లో రానున్న ఈ వెబ్ ఒరిజినల్‌కి చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 15, 2022 నుండి ఈ వెబ్ ఒరిజినల్ ఆహా ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. బ్లడీ మేరీలో బ్రహ్మాజీ, అజయ్, కిరీటి, రాజ్‌కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ OTT సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa