ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘టైగర్‌ నాగేశ్వరరావు' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 17, 2022, 11:31 PM

మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు'. ఈ సినిమాకి వంశీ  దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా రూపొందనుంది. 1970లలో దేశవ్యాప్తంగా పేరుమోసిన స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాతో కెరీర్లోనే తొలిసారిగా బాలీవుడ్ ను పలకరించబోతున్నాడు రవితేజ. తాజాగా ఈ సినిమా కోసం 1970ల నాటి స్టూవర్ట్‌పురం విలేజ్ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ.7 కోట్లతో సెట్ వర్క్ జరుగుతోంది.  ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు ఆడిపాడనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa