ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజశేఖర్‌ 'శేఖర్‌' సినిమా విడుదల తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 18, 2022, 10:50 AM

ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ తన 91వ సినిమాని లలిత్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'శేఖర్' అనే టైటిల్ మూవీ మేకర్స్ ఖరారు చేసారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మలయాళ థ్రిల్లర్ 'జోసెఫ్' సినిమా అధికారిక రీమేక్. ఈ సినిమాలో అను సితార అండ్ ముస్కాన్ ఖుబ్‌చందానీ కథానాయికలుగా నటిస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా మే 20న విడుదల కానుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని అండ్ శివాత్మికతో పాటు MLV సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa