పవన్ కళ్యాణ్ సరసన 'కొమురం పులి' సినిమాలో నటించిన నిఖీషా పటేల్ త్వరలో తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో వెల్లడించింది. తెలుగులో ఆమె నటించి కొమురం పులి సినిమా సరిగ్గా ఆడకపోవడంతో టాలీవుడ్‌కు దూరమైంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఎవరిని పెళ్లి చేసుకుంటారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తాను పెళ్లిచేసుకోబోయే వరుడు యూకేలో ఉంటాడని చెప్పింది. ఇక మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగగా ఫెయిర్ అండ్ లవ్‌లీ అని, ప్రభాస్‌కు మంచి స్నేహితుడని, రజనీకాంత్‌కు కింగ్ అని, ఫేవరెట్ హీరో ధనుష్ అని బదులిచ్చింది. మెగాస్టార్ గురించి అడగ్గా చాలా మంది ఉన్నారని, అందులో ఎవరి గురించి అడుతున్నారని ప్రశ్నించింది. దీంతో అవాక్కవడం అభిమానుల వంతు అయింది.