అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా రాబోతున్న సినిమా ‘ఎఫ్ 3’. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. దేవి తన ఎనర్జిటిక్ పాటలతో సినిమా స్థాయిని పెంచుతున్నాడు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలోని రెండో పాట 'ఓ.. ఆ.. ఆహా ఆహా'ని ఏప్రిల్ 22న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్ కూడా వదిలారు. పోస్టర్‌లో హీరోయిన్లు ఓ వైపు, హీరో మరోవైపు తీగ లాగుతున్నారు. మొత్తానికి పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్‌లో తమన్నా చాలా గ్లామర్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa