రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌లుగా తెరకెక్కిన చిత్రం “RRR”. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది.ఈ చిత్రంవిడుదలై 24 రోజులు దాటినా, కేజీఎఫ్ 2 మూవీ ప్రభంజనాన్ని తట్టుకుని కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.
ఈ చిత్రం రూ. 572.48 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా హిందీలో రూ. 124.60 కోట్ల షేర్.. (రూ. 250 కోట్ల గ్రాస్ ) వసూళ్లు చేసింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 133.04 కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa