ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ వాసుల గురించి నటి ప్రణీత ఏమన్నారంటే..

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 30, 2018, 01:50 PM

అందాల తార ప్రణీత శుక్రవారం సాయంత్రం నగరంలో సందడి చేసింది. ఆమె ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంది. ఆమె రాకను తెలుసుకొని వచ్చిన అభిమానులను పలకరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగులో ‘హలో గురూ. ప్రేమ కోసమే రా..’ చిత్రంలో నటిస్తున్నట్టు తెలిపింది. అలాగే తన తొలి హిందీ చిత్రం పాట శనివారం యూట్యూబ్‌లో విడుదల కాగా ఐదు మిలియన్ల మంది వీక్షించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంచి పాత్రల్లో నటించి గొప్ప నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని ప్రణీత పేర్కొంది.


 విశాఖ చాలా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నగరమని, ఈ నగరమంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఇక్కడ ప్రజలు ఎంతో సౌమ్యులని, గొప్ప విహార కేంద్రాలు ఉన్నాయన్నారు. సినిమా షూటింగ్స్‌కు విశాఖ ఎంతో అనువైన ప్రాంతమన్నారు. ఇక్కడి ప్రకృతి అందాలు ఎంత చూసినా తనవితీరదన్నారు. ఆమెతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa