కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా 20 ఏప్రిల్, 2018న విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లామర్ క్వీన్ కియారా అద్వానీ జంటగా నటించింది. నేటితో 'భరత్ అనే నేను' సినిమా థియేటర్లలో విడుదలై 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. #4ఇయర్స్ ఫర్ భారత్ అనే నేను అంటూ మహేష్ అభిమానులు ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తూ ఈ సినిమాలోని డ్యాన్స్ స్టెప్పులు, డైలాగ్‌లుని షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ కీలక పాత్రలలో పోషించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa