ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుమంత్ సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 01, 2018, 10:26 AM

మ‌ళ్ళీ రావా చిత్రంతో ఫాంలోకి వచ్చిన సుమంత్ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. త‌న 24వ సినిమా ఇదం జ‌గత్ ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌ల‌యాళం హీరోయిన్ అంజు కురియ‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్ట‌ర్ అనీల్ శ్రీకాంతం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీచ‌ర‌ణ్ ప‌కాలా సంగీతం అందిస్తున్నాడు. త్వ‌ర‌లోనే మూవీ విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్నారు. ఇక‌ సుమంత్ 25వ చిత్రంగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం అనే చిత్రం రూపొందుతుంది. ఉగాది రోజు ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈషా కథానాయికగా నటిస్తున్నది. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ జోనర్‌లో సుమంత్‌ సినిమా చేయడం ఇదే తొలిసారి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. స‌గానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం న‌వంబర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa