ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మిషన్ ఇంపాజిబుల్'

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 12:40 PM

స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ తాప్సీ పన్ను నటించిన "మిషన్ ఇంపాజిబుల్" ఏప్రిల్ 1, 2022న థియేటర్‌లలో విడుదలయింది. నిరంజన్ రెడ్డి అండ్ అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తాప్సీ ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. క్రైమ్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ మూవీని ఏప్రిల్ 29, 2022 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, భాను ప్రకాశన్ మరియు జయతీర్థ మొలుగు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా, దీపక్ యెరగరా కెమెరాను అందించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, పీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa