పరశురామ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారువారిపాట. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటికే కళావతి, పెన్నీ పాటలు విడుదలవగా అవి యూట్యూబులో అత్యధిక వీక్షణలతో సంచలన విజయం సాధించాయి. అయితే... తాజాగా ఈ మూవీ నుండి మూడో పాటను విడుదల చెయ్యటానికి ముహూర్తం ఖరారు చేసారు చిత్రబృందం. సర్కారువారిపాట టైటిల్ సాంగ్ గా మూడో పాట రానుందని తెలుస్తోంది. ఏప్రిల్ 23, ఉదయం 11. 07 నిమిషాలకు ఈ పాట లిరికల్ వెర్షన్ ను విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మేరకు ఒక స్పెషల్ పోస్టర్ను కూడా విడుదల చేసారు. మొదటి రెండు పాటలు విశేష ప్రేక్షకాదరణ దక్కించుకోవటంతో ఈ మూడో పాట కూడా మంచి హిట్ అవుతుందని చిత్రబృందం ఎంతో నమ్మకంగా ఉంది. సాధారణంగా మహేష్ సినిమాలలో టైటిల్ సాంగ్స్ చాలా బావుంటాయి. ఇప్పడు థమన్ డైరెక్షన్లో టైటిల్ సాంగ్ అంటే ప్రేక్షకులు ఈ పాటను ఒక రేంజులో ఊహించుకుంటున్నారు. ఈ అంచనాలను థమన్ ఏ మేరకు అందుకుంటాడో చూడాలి మరి.
పోతే... వేసవి కానుకగా ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతాగోవిందం లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను అందించిన పరశురామ్ మహేష్ కు అంతకు మించి హిట్ ఇస్తాడని మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa