అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. వేసవి లో ప్రేక్షకులను ఉల్లాసపరచటానికి మే 27న ఈ చిత్రం విడుదల కానుంది. తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాడా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, సోనాల్ చౌహన్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. DSP మ్యూజిక్ డైరెక్షన్లో మొదటి పాటగా విడుదలైన లబ్ డబ్ డబ్బో పాట మంచి ఆదరణ పొందింది. తాజాగా ఈ మూవీ నుండి విడుదలైన రెండో పాట ఊఁ ఆఁ ఆహా ఆహా పాటకు కూడా ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ల మీద చిత్రీకరించిన ఈ పాట ఎఫ్ 2 లోని రయ్యా రయ్యా పాటలాగా ఫుల్ గ్లామర్ తో నిండిపోయింది. తమన్నా, మెహ్రీన్ లు తమ గ్లామర్ తో, డాన్స్ మూవ్మెంట్స్ తో అబ్బురపరిచారు. ఇటీవల విడుదలైన హాట్ సాంగ్స్ లో ఈ పాటను ది బెస్ట్ గా చెప్పవచ్చు. పోతే... ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, శ్రీనిధి చౌహన్, లలిత లోబో ఆలపించారు. శేఖర్ మాస్టర్ తన కొరియోగ్రఫీతో మ్యాజిక్ చేసారు. ఈ పాటలో డాన్స్ చేసే అవకాశాన్ని సునీల్ చాలా బాగా ఉపయోగించుకున్నాడు. ఈ పాట షూట్ జరుగుతున్నప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అల్లు అర్జున్ లు సెట్స్ కి వచ్చిన విజువల్స్ కూడా ఈ పాటలో కనిపిస్తాయి. మొదటి పాట లబ్ డబ్ డబ్బో పాట కన్నా ఊఁ ఆఁ ఆహా ఆహా పాట పెద్ద హిట్ అవుతుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa