తెలుగు ప్రేక్షకులకి యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. స్మాల్ స్క్రీన్‌పైనే కాకుండా వెండితెరపై కూడా ఈ గ్లామర్ బ్యూటీ తన టాలెంట్ ని చూపుతుంది. పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో అనసూయ సినిమాకి సైన్ చేసింది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రానికి 'ఆరి' అనే టైటిల్‌లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని ఆర్.వి.రెడ్డి మరియు శేషు మారంరెడ్డి RV సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa