AR అభి దర్శకత్వంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ అండ్ మోక్ష నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమంతో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకి 'లక్కీ లక్ష్మణ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ లాంచ్ ఈవెంట్ కి మిరియాల రవీంద్రారెడ్డి, బెక్కెం వేణుగోపాల్, పుప్పాల రమేష్, రాజా రవీంద్ర వంటి అతిధులు హాజరై అందరూ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ప్రవీణ్ సత్తారు ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. సి కళ్యాణ్ తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నిర్మాత అప్పిరెడ్డి ఆవిష్కరించారు. వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియాపై హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa