ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆది సాయి కుమార్‌ తదుపరి సినిమాకి దర్శకత్వం వహించనున్న 'లవ్లీ' రైటర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 10:19 AM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ 'ప్రేమ కావాలి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన నటనతో ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో విడుదలైన ఆది మూవీస్ అన్ని బాక్స్ఆఫీస్ వద్ద పెద్దగా ప్రాభవం ఏమి చూపలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఆది మరో ఎంటర్‌టైనర్‌ మూవీకి సైన్ చేసినట్లు సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం, 'లవ్లీ' మూవీ రైటర్ శ్యామ్ మనోహర్ ఈ సినిమాకి దర్శకుడిగా మారి ఆదికి హిట్ ఇవ్వడానికి చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం టాప్ టెక్నీషియన్లను సెలెక్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఆది సరసన ఈ సినిమాలో హాట్ బ్యూటీ డింపుల్ హయతీ రొమాన్స్ చేయనుంది అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa