బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ నటసింహ నందమూరి బాలకృష సింహా, లెజెండ్, అఖండ సినిమాలని చేసారు. ఈ మూడు సినిమాలు బాక్స్ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇటీవల విడుదలైన 'అఖండ' సినిమా బాలయ్య కరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్ రానుంది అని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం, ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ లో లేటెస్ట్ టాక్. ఈ సినిమా పొలిటికల్ డ్రామా ట్రాక్ లో రానుంది అని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసిన తర్వాత 2023లో ఈ సినిమా ప్రారంభమవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. 14 రీల్స్ ప్లస్‌కి చెందిన రామ్ ఆచంట అండ్ గోపీ ఆచంట ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'జై బాలయ్య' సినిమా షూటింగ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa