పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారువారిపాట. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన కళావతి, పెన్నీ పాటలు శ్రోతలను మైమరిపిస్తున్నాయి. షూటింగ్ తో పాటుగా ఒకేసారి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా మే 12 న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన కూడా చేసింది.
తాజాగా ఈ మూవీ నుండి టైటిల్ సాంగ్ సాంగ్ విడుదలైంది. సరా సరా సరా సరా సర్కారువారిపాట అని సాగే ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ ను సింగర్ హారికా నారాయణ్ ఆలపించగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యమందించారు. ఈ పాట కూడా చార్ట్ బస్టర్ గా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa