ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ‘లాకప్’ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. షోలో భాగంగా ప్రముఖ కంటెస్టెంట్ మునవర్ ఫారూఖీ తాను 6 ఏళ్ల వయస్సులో లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపాడు. అనంతరం కంగనా రనౌత్ కూడా తన చిన్నప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.
తన చిన్నతనంలో గ్రామంలో తన కంటే పెద్ద వాడైన ఓ వ్యక్తి తనను ఉద్దేశపూర్వకంగా ఎక్కడంటే అక్కడ తాకుతూ ఉండేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ వయసులో అతని ఉద్దేశం ఏంటో తనకు సరిగా అర్థం అయ్యేది కాదని, తనలాంటి వారిని పిలిచి బట్టలు విప్పమని అడిగేవాడని తెలిపింది. శరీరాన్ని తడుముతూ ఏవేవో చేసేవాడని, తమకు అప్పుడు 6 ఏళ్లు మాత్రమేనని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు అతడి నుంచి వేధింపులు అనుభవించినట్లు కంగనా తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa