సూరరై పొట్రు (ఆకాశం నీ హద్దు రా) సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సుధా కొంగర కొన్ని రోజుల క్రితం ఈ సినిమా హిందీ రీమేక్‌ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అండ్ రాధిక మదన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. రాధిక కొబ్బరికాయ పగలగొట్టిన వీడియోని అక్షయ్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఈ వీడియోలో అక్షయ్ కుమార్ మరియు సుధా కొంగర కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి టైటిల్ ని సజెస్ట్ చేయమని అభిమానులని కోరారు.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ అతని భార్య జ్యోతిక ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa