ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ గా చేస్తున్న రియాల్టీ షో లాకప్. ఈ రియాల్టీ షో లో సంచలన విషయాలు బయటకి స్తున్నాయి. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ మునవర్ ఫారూఖీ.... తాను 6 ఏళ్ల వయస్సులో లైంగిక వేధిం పులకు గురయ్యానని చెప్పాడు. అప్పట్లో తమ దగ్గరి బంధువులు ఇద్దరు తనను లైంగికంగా వేధిం చారని, దాదాపు ఐదేళ్ల పాటు ఈ వేధింపులను ఎదుర్కొన్నానని తెలిపాడు. అనంతరం కంగనా కూడా తనకు చిన్నప్పుడు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పారు. తమ గ్రామంలో తన కంటే పెద్ద వాడైన ఓ వ్యక్తి తనను అసభ్యకరంగా తాకేవాడని, శరీరాన్ని తడిమేవాడని చెప్పారు.
పిల్లలను పిలిచి బట్టలు విప్పమని కూడా చెప్పేవాడని తెలిపారు. ఆ సమయంలో అతడి ఉద్దేశ్యం తమకు తెలియదని పేర్కొన్నారు.పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచుతున్నప్పటికీ, సమాజంలో కామాంధుల వల్ల ఇలాంటివి జరుగుతుంటాయని, ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa