గత కొంత కాలంగా వుమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొడుతుంది టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత. తాజాగా ఆమె నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం శాకుంతలం. గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణశేఖర్ టీం వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గుణశేఖర్ తనయురాలు నీలిమా గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది. దుశ్యంతుని ప్రేయసి, భరతుని తల్లి అయిన శకుంతల జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ఫిబ్రవరి లో విడదల చేసారు. సమంత మైథలాజికల్ లుక్ కు సామ్ ఫ్యాన్స్ మాత్రమే కాక ఆడియన్స్ కూడా అబ్బుర పడ్డారు. ఇక అప్పటినుండి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఈ అంచనాలను చిత్రబృందం కొంచెం కూడా రీచ్ అవ్వట్లేదు. ప్రేక్షకులేమో ఈ మూవీ నుండి కొత్త పోస్టర్ కానీ, టీజర్ కానీ, గ్లిమ్స్ గానీ ఇలా ఎదో ఒకటి రావాలని కోరుకుంటుండగా, చిత్రబృందం మాత్రం ఈ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ ను ఇవ్వట్లేదు. దీంతో సమంత అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారట.
ఈ చిత్రంలో దేవ్ మోహన్, మధూ, అదితి బాలన్, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గారాల పట్టి అల్లు అర్హ ఈ చిత్రంలో యువ భరతుని వేషం లో నటించటం విశేషం. ఇదే అర్హకు తొలి స్క్రీన్ ప్రెజెన్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa