ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ చిత్రం ఎమోషన్ తో కూడిన కథతో నడుస్తుంది: రామ్ చరణ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 12:03 AM

చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'ఆచార్య' ఈ నెల 29వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, వేగంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరితో చేయనున్న సినిమాకి సంబంధించిన ప్రశ్న చరణ్ కి ఎదురైంది. ఇంతకుముందు నానీతో 'జెర్సీ' సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి, తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను సాధించాడు. అదే సినిమాను హిందీలోను రీమేక్ చేశాడు. ఆ తరువాత సినిమాను చరణ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది కూడా స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతుందనే టాక్ వచ్చింది. 


'ఆచార్య' ప్రమోషన్స్ లో ఇదే ప్రశ్న చరణ్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. ఈ కథ స్పోర్ట్స్ నేపథ్యానికి సంబంధించినది కాదు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ డ్రామాగా సాగుతుంది" అంటూ స్పష్టం చేశాడు. ఈ సినిమాలో కథానాయికలుగా రష్మిక .. కృతి శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. శంకర్ సినిమా తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa