టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో 'RC15' సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'ఆచార్య' సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయనున్నాడు. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా అని వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా 'ఆచార్య' ప్రమోషన్స్ సందర్భంగా ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా కాదని, సెన్సిబుల్ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి తమిళ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa