పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రొడక్షన్‌ను పూర్తి చేసి రీరికార్డింగ్, ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. మహేష్ బాబుకు తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్ కూడా 12 న విడుదల అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ విడుదలకు సంబంధించి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ భారీ బడ్జెట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీకి తమిళంలో 'పుదియ అరసాంగం' అనే టైటిల్‌ని లాక్ చేసినట్లు లేటెస్ట్ టాక్. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa