కేజీఎఫ్ ఫ్రాంచైజీ తో దేశవ్యాప్త క్రేజును సొంతం చేసుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్. 2018లో చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టడంతో దీనికి కొనసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ 2 పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 ను రూపొందించారు. హోంబలే ఫిలిం బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధిశెట్టి నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను వసూలు చేస్తోంది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా అన్ని చోట్లా కూడా కేజీఎఫ్ 2 జోరు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. కేజీఎఫ్ 2 బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మాత్రం ఈ చిత్రం బయ్యర్లకు నష్టాలను మిగిల్చేలా ఉంది. రూ. 49 కోట్లకు కొనుగోలు చేసిన కేజీఎఫ్ 2 కు ఇప్పటివరకూ అక్కడ కేవలం రూ. 36.28 కోట్లను మాత్రమే వసూలు చేసింది. కారణం-టికెట్ రేట్లు అన్ని చోట్ల కన్నా ఆంధ్రాలో తక్కువగా ఉండటం. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి బయ్యర్లకు లాభాలు రావాలంటే, మరో 12 కోట్లను కలెక్ట్ చెయ్యాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తాన్ని వసూలు చెయ్యటమంటే చాలా కష్టమనే చెప్పాలి. పైగా రేపు ఎన్నో అంచనాల మధ్య చిరంజీవి, చరణ్ ల ఆచార్య విడుదల కాబోతుంది. మరి ఆచార్య తో పోటీపడి కేజీఎఫ్ 2 ఏపీలో బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేక చిరు ధాటికి తట్టుకోలేక చతికిల పడుతుందా.... అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa