జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి '12 త్ మ్యాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. డిస్నీ హాట్‌స్టార్ ఈ సినిమా OTT రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా డైరెక్ట్ OTT రిలీజ్ కానున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చివర్లో, మోహన్‌లాల్ 'ఫైనల్ విజిల్ వేసే సమయం వచ్చింది' అనే డైలాగ్‌ని చెప్పారు. ఈ సినిమా టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ని పెంచేసింది. ఉన్ని ముకుందన్, అనుశ్రీ, అను సితార ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ జాన్సన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa