ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివాళికి విడుదల కానున్న అక్షయ్ కుమార్ 'రామసేతు'

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 29, 2022, 03:02 PM

అభిషేక్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రామసేతు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ చిత్రం 2022 దీపావళికి విడుదల కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అక్షయ్ కుమార్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించి, మొదటి వీడియో గ్లింప్సెని పంచుకున్నారు. ఈ వీడియో గ్లింప్సెలో అక్షయ్ కుమార్‌తో పాటు సత్యదేవ్ కూడా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ఫిల్మ్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa