ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ లో గాయపడ్డ హీరో గోపీచంద్... ప్రమాదమేమీ లేదన్న దర్శకుడు

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 30, 2022, 02:36 PM

టాలీవుడ్ మాస్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తనకు లక్ష్యం, లౌక్యం వంటి బిగ్ హిట్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ తన తదుపరి సినిమాను చేస్తు న్నాడు. ప్రస్తుతం కర్ణాటకలోని మైసూరులో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. డూప్ లేకుండా ఒక యాక్షన్ సీన్లో నటిస్తున్న గోపీచంద్ అనుకోకుండా ప్రమాదానికి గురయ్యాడని ఆ చిత్ర దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. గోపీచంద్ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయాడని, అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందనీ, అభిమానులు ఖంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. పోతే... ఈ సినిమాకు లక్ష్యం 2 అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట చిత్రబృందం. శ్రీవాస్-గోపీచంద్  కాంబోలో రానున్న మూడో సినిమా కావటంతో  ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa