ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్ ఏంజెలినా జోలీగా బాలీవుడ్ క్వీన్...?

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 30, 2022, 03:18 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ధాకడ్. గూఢచారి తరహా యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు రజనీష్ ఘాయ్ ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. అసెలం ఫిలిమ్స్, సోహం రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, సోహెల్ మక్లాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా, సస్వత ఛటర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు హీరోయిక్ ఫిలిమ్స్ లో గ్లామరస్ గా కనిపించిన కంగనా తన రూటు మార్చి చేస్తున్న చిత్రమిది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ నిన్ననే రిలీజ్ అయ్యింది. యాక్షన్ ప్యాక్డ్ పాత్రకు  కంగనా తనదైన గ్లామర్ ను కూడా జోడించి ఈ మూవీ చెయ్యటంతో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీని తలపిస్తుంది. 


కంగనా ఈ సినిమాలో చేయబోతున్న భారీ యాక్షన్ సీన్స్ తో ఈ మూవీ పై నార్త్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. బాలీవుడ్ హీరోలకు ధీటుగా కంగనా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చేసిందని టాక్. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజులో మే 20 న రిలీజ్ చేయబోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa