శుక్రవారం తన 153వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల డైరెక్షన్లో, దేవాదాయ భూముల కుంభకోణం నేపధ్య కథతో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ సిద్ద అనే స్పెషల్ రోల్ లో నటించారు. చెర్రీ సరసన పూజాహెగ్డే నటించింది. మణిశర్మ సంగీతం అందించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. మెగాస్టార్ సినిమా కాబట్టి వసూళ్లు ఫరవాలేదనిపిస్తున్నాయి. అదికూడా ఈ శని, ఆదివారాలే. ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు భారీగా డ్రాప్ అవుతాయని అంచనా. అయితే ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుందని మేకింగ్ అప్పుడు చెప్పుకొచ్చారు. అయితే కాజల్ పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడంతో సినిమా నుండి ఆమెను తొలగించినట్టు కొరటాల ఈ మధ్యనే క్లారిటీ ఇచ్చారు. పోతే... ఈ సినిమా కోసం కాజల్ కొన్ని రోజులు చిత్రీకరణలో కూడా పాల్గొంది. మొదటి పాటగా విడుదలైన లాహే లాహే పాటలో కాజల్ సీన్స్ కూడా ఉంటాయి. దీంతో మూవీలో ఈ పాటలోనైనా కాజల్ కనిపిస్తుందనుకున్నారు అభిమానులు. తీరా తెర మీద చూస్తే ఏముంది? ఆ పాటలో కాజూ బేబీ సీన్ ఒక్కటి కూడా లేదు. ఇది చూసిన కాజల్ వీరాభిమాని ఒకరు బయటకొచ్చిన తర్వాత మీడియాతో తన గోడును వెళ్ళబోసుకున్నాడు. కాజల్ ఏది భయ్యా? అని కన్నీరు మున్నీరయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa