దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ "సర్కారు వారి పాట". ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ తొలిసారిగా నటిస్తుండగా, ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మరియు అభిమానుల నుండి భారీ స్పందన వస్తోంది.
Our meeting is confirmed in theatres on May 12th!
Here's the trailer of #SarkaruVaariPaatahttps://t.co/r874NLN0FT@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @GMBents @MythriOfficial @14ReelsPlus @saregamasouth
— Mahesh Babu (@urstrulyMahesh) May 2, 2022
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. భారీ ట్రైలర్‌తో సినిమా ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్, డైలాగ్స్ ట్రైలర్ లో హైలెట్ అయ్యాయి. అతను నా ప్రేమను దొంగిలించగలడు, అతను నా స్నేహాన్ని దొంగిలించగలడు, కానీ అతను నా డబ్బును దొంగిలించలేడు అనే సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. థమన్ తన నేపథ్య సంగీతంతో ట్రైలర్‌లో మరోసారి మ్యాజిక్ చేశాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ చాలా గ్లామరస్‌గా కనిపించనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దర్శకుడు పరశురామ్ సూపర్‌స్టార్‌గా చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం ను మే 12 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa