ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ తేదీన విడుదల కానున్న 'రంగా రంగ వైభవంగా' లోని రెండవ పాట

cinema |  Suryaa Desk  | Published : Wed, May 04, 2022, 10:04 AM

మొదటి సినిమా "ఉప్పెన" తో హిట్ సాధించిన పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం "రంగ రంగ వైభవంగా" సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతికా శర్మ, వైష్ణవ్ సరసన నటిస్తుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా జూలై 1, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని రెండవ పాటను మే 5, 2022న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోస్ చేసిన ఈ పాటకు 'కొత్తగా లేదేంటి' అని పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ బ్యాంక్రోల్ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa