ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విడుదల కానున్న 'కృష్ణ బృందా విహారి' లోని సెకండ్ సింగల్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 04, 2022, 10:15 AM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య 'కృష్ణ బృందా విహారి' అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన షిర్లీ సెటియా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది అని సమాచారం. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని 'ఏముందిరా' అనే రెండో పాటను ఈరోజు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. మే 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa